ఇక నా సత్తా చూపిస్తా: తేజ్ ప్రతాప్
తను పోటీ చేస్తున్న మహువాలో ప్రతిపక్ష కూటమి సీఎం అభ్యర్థి ప్రచారం చేయటంపై లాలూ ప్రసాద్ యాదవ్ పెద్ద కుమారుడు తేజ్ ప్రతాప్ కీలక వ్యాఖ్యలు చేశారు. తనకు వ్యతిరేకంగా తన సోదరుడు తేజస్వీ ప్రచారం చేయడని అనుకున్నానని తెలిపారు. కానీ తేజస్వీ ప్రచారం చేశారని అయినా పెద్ద ఒరిగేది ఏమి లేదన్నారు. తను కూడా తేజస్వీ పోటీ చేస్తున్న రాఘోపూర్‌లో ప్రచారం చేస్తానని చెప్పారు.