9 మంది విద్యార్థులకు అస్వస్థత
AP: ప్రొద్దుటూరులో కలుషిత ఆహారం తిని 9 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. వసంతపేట పురపాలక ఉన్నత పాఠశాల విద్యార్థులు ఆహారం తినగానే వాంతులు, కడుపు నొప్పి రావడంతో ఉపాధ్యాయులు ఆస్పత్రికి తరలించారు. ప్రొద్దుటూరు ప్రభుత్వాసుపత్రిలో విద్యార్థులకు వైద్యులు చికిత్స అందిస్తున్నారు.