రాష్ట్రస్థాయి ఖోఖో పోటీలకు ఎంపికైన మందమర్రి యువకుడు

రాష్ట్రస్థాయి ఖోఖో పోటీలకు ఎంపికైన మందమర్రి యువకుడు

MNCL: మందమర్రి మండలంలోని పొన్నారం ఉన్నత పాఠశాలకు చెందిన కోట్రాంగి దుర్గాప్రసాద్ రాష్ట్రస్థాయి ఖోఖో పోటీలకు ఎంపికైనట్లు పాఠశాల HM దత్తమూర్తి, PET శ్రీనివాస్ ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. భువనగిరి జిల్లాలో జరిగే రాష్ట్రస్థాయి ఖోఖో పోటీల్లో దుర్గాప్రసాద్ పాల్గొంటాడన్నారు. క్రీడాకారుడిని MEO, ప్రధానోపాధ్యాయుడు, వ్యాయమ ఉపాధ్యాయుడు, ఉపాధ్యాయులు అభినందించారు.