ప్రజా దర్బార్ కార్యక్రమంలో పాల్గొన్న MLA
ప్రకాశం: కొమరోలు ఎంపీడీవో కార్యాలయంలో శనివారం 'ప్రజా దర్బార్' కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా గిద్దలూరు ఎమ్మెల్యే అశోక్ రెడ్డి స్వయంగా ప్రజల నుండి అర్జీలను స్వీకరించి, వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అర్జీలను పరిశీలించి, త్వరితగతిన సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని ఆయన హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో టీడీపీ మండల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.