చాకలి ఐలమ్మ స్ఫూర్తి మార్గదర్శకం: కలెక్టర్

చాకలి ఐలమ్మ స్ఫూర్తి మార్గదర్శకం: కలెక్టర్

BHPL: జిల్లా ఐడీఓసీ కార్యాలయంలో బుధవారం బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో చాకలి ఐలమ్మ 40వ వర్ధంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ముఖ్యఅతిథిగా కలెక్టర్ రాహుల్ శర్మ హాజరై, చాకలి ఐలమ్మ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. అన్యాయం, అణచివేతలకు వ్యతిరేకంగా ఐలమ్మ ధైర్యంగా పోరాడారని, ఆమె జీవితం నేటి తరాలకు స్ఫూర్తిదాయకమని అన్నారు.