గుత్తి కోటను సందర్శించిన జిల్లా కలెక్టర్

గుత్తి కోటను సందర్శించిన జిల్లా కలెక్టర్

ATP: గుత్తి కోటను జిల్లా కలెక్టర్ ఆనంద్ ఇవాళ సందర్శించినట్లు తెలిపారు. కోట సంరక్షణ సమితి సభ్యులు, పురావస్తు శాఖ అధికారులు ఆయనకు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రోడ్డు నిర్మాణం కోసం పురావస్తు, రెవెన్యూ అధికారులతో కలిసి త్వరలో మ్యాప్‌ను సిద్ధం చేయవలసిందిగా సిబ్బందిని ఆదేశించారు. మున్సిపల్ కమిషనర్ జబ్బర్ మియా, తదితరులు పాల్గొన్నట్లు తెలిపారు.