VIDEO: మున్సిపల్ కార్యాలయం ఎదుట కార్మికుల ఆందోళన
JGL: జగిత్యాల పురపాలక కార్యాలయం వద్ద మున్సిపల్ కార్మికులు ఆందోళనకు దిగారు. గత మున్సిపల్ ఎన్నికల సమయంలో అదనపు పనులు చేయించుకున్న అధికారులు, ఇప్పటికీ తమ జీతాలు చెల్లించలేదని వారు ఆరోపిస్తున్నారు. ఎన్నికల ఖర్చుల కింద అధికారులు రూ. 1.70 కోట్లు చూపించినా, తమకు మాత్రం పైసా ఇవ్వలేదని కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.