పెంటపాడులో 'టీకాలు వేయించండి.. పాడిని కాపాడుకోండి'
W.G; పశువుల ఆరోగ్యంతోనే పాడి పరిశ్రమ వృద్ధి చెందుతుందని మౌంజీపాడు సర్పంచ్ ఆలపాటి రామకృష్ణ పేర్కొన్నారు. పెంటపాడు మండలంలో నిర్వహించిన పశు ఆరోగ్య శిబిరంలో ఆయన మాట్లాడారు. సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉంటూ ముందస్తుగా టీకాలు వేయించాలని రైతులకు సూచించారు. పాతూరి రాంప్రసాద్ చౌదరి, వైద్యులు మౌనిక, క్రాంతి పాల్గొని పశువులకు వైద్య పరీక్షలు నిర్వహించారు.