VIDEO: నేషనల్ హైవే పనులను పరిశీలించిన ఎమ్మెల్యే
కృష్ణా: పామర్రులోని NTR సర్కిల్ వద్ద జరుగుతున్న నేషనల్ హైవే అభివృద్ధి పనులను MLA వర్ల కుమార్ రాజా గురువారం పరిశీలించారు. రోడ్డు విస్తరణ పనుల పురోగతిని సమీక్షించి స్థానిక చిరు వ్యాపారులతో మాట్లాడారు. పనుల సమయంలో వారికి నష్టం కలగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని హైవే అధికారులను ఆదేశించారు. ట్రాఫిక్ ఇబ్బందులు తగ్గేలా పనులు వేగవంతం చేయాలని సూచించారు.