ఏప్రిల్‌లో రెట్టింపు చమురు సమస్యలు: IEA
అంతర్జాతీయ ఎనర్జీ ఏజెన్సీ హెడ్ ఫతిహ్ బిరోల్ కీలక వ్యాఖ్యలు చేశారు. హర్మూజ్ జలసంధి మూసివేత కారణంగా చమురు సరఫరా సంక్షోభం ఈ నెలలో రెట్టింపు కానుందని తెలిపారు. ఈ ప్రభావం యూరప్‌పై కూడా ఉంటుందన్నారు. అత్యధికంగా LNGపై ప్రభావం ఉండే అవకాశం ఉందన్నారు. జెట్ ఫ్యూయల్, డీజిల్ కొరత సమస్య ప్రధానంగా ఉందని చెప్పారు. ఇప్పటికే ఆసియాలో ఇంధన కొరత ఏర్పడిందని బిరోల్ వెల్లడించారు.