వనపర్తిలో అడవుల రక్షణకు పిలుపు
వనపర్తి: జిల్లాలో సుమారు 63 వేల హెక్టార్లలో అడవులు విస్తరించి ఉన్నాయని అధికారులు తెలిపారు. అడవుల అభివృద్ధికి విస్తృతంగా మొక్కలు నాటి సంరక్షణ చర్యలు చేపడుతున్నామని FRO పర్వేజ్ అహ్మద్ తెలిపారు. వన్యప్రాణుల కోసం చెక్ డ్యామ్‌లు నిర్మిస్తున్నామని తెలిపారు. కొంత అటవీ భూమి సాగులోకి మారిందని, రక్షణకు ప్రజల సహకారం అవసరమన్నారు.