భూగర్భ డ్రైనేజీ పనులకు నిధులు మంజూరు: కార్పొరేటర్

MDCL: నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తానని చర్లపల్లి డివిజన్ కార్పొరేటర్ బొంతు శ్రీదేవి యాదవ్ అన్నారు. శుక్రవారం నేతాజీ నగర్‌లో పర్యటించి మాట్లాడుతూ.. కాలనీ వాసుల విజ్ఞప్తి మేరకు 200 మీటర్ల భూగర్భ డ్రైనేజీ పనులకు నిధులు మంజూరయ్యాయన్నారు. త్వరలోనే ఈ పనులు ప్రారంభం కానున్నాయని ఆయన పేర్కొన్నారు.