టీటీడీపై మాజీ ఛైర్మన్ తప్పుడు ప్రచారం

టీటీడీపై మాజీ ఛైర్మన్ తప్పుడు ప్రచారం

టీటీడీ మాజీ ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి మత విద్వేషాలు రెచ్చగొట్టేందుకు గోవుల మరణాలపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని బొబ్బిలి ఎమ్మెల్యే బేబినాయన మండి పడ్డారు. ఈ మేరకు ఆదివారం ఒక ప్రకటనలో కోట్లాది మంది మనోభావాలు దెబ్బ తీసేందుకు టీటీడీపై తప్పుడు ప్రచారం చేయడం, గోశాలలో 100 ఆవులు చనిపోయాయని చేస్తున్న ప్రచారంలో ఎటువంటి వాస్తవం లేదని పేర్కొన్నారు.