విద్యుత్ శాఖపై సీఎం కీలక సమీక్ష

TG: కొత్తగా ఏర్పాటు చేయబోయే డేటా సెంటర్లు, పారిశ్రామిక వాడలకు కావాల్సిన విద్యుత్ అవసరాలను దృష్టిలో ఉంచుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులకు సూచించారు. రైల్వే లైన్లు, మెట్రో, ఇతర మాస్ ట్రాన్స్ పోర్ట్‌ల విద్యుత్ అవసరాలను పరిగణనలోకి తీసుకోవాలన్నారు. గ్రేటర్ హైదరాబాద్‌తో పాటు ఇతర కార్పొరేషన్ల విద్యుత్ అవసరాలను పరిగణలోకి తీసుకోవాలని వెల్లడించారు.