VIDEO: సమ్మక్క-సారలమ్మ దర్శనానికి తరలివచ్చిన భక్తులు
MLG: మేడారం జాతరలో సమ్మక్క–సారలమ్మ దర్శనానికి ఆదివారం భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన భక్తులతో సమ్మక్క, సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజుల గద్దెలు భక్తులతో కిక్కిరిసిపోయాయి. ప్రస్తుతం భక్తుల రద్దీ తగ్గడంతో వనదేవతల గద్దెలలోనికి భక్తులకు అనుమతి ఇవ్వగా, వారు నేరుగా అమ్మవార్లను దర్శించుకుని మొక్కులు చెల్లించుకుంటున్నారు.