VIDEO: వైన్ షాప్ ఏర్పాటు చేయొద్దని మహిళల ధర్నా
ASF: రెబ్బెన మండలం గోలేటి గ్రామంలో జనావాసాల మధ్య వైన్ షాప్ నిర్వహించొద్దని మహిళలు సోమవారం ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా పలువురు మహిళలు, నాయకులు మాట్లాడుతూ.. ఇటీవల గోలేటి గ్రామానికి నూతనంగా మంజూరైన వైన్ షాప్‌ను జనావాసాల ఏర్పాటు చేయడం వల్ల ఇబ్బందులు అవుతాయని మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు స్పందించి వైన్ షాప్ ఏర్పాటు చేయొద్దని కోరారు.