అప్పుల బాధ భరించలేక రైతు ఆత్మహత్యాయత్నం

అప్పుల బాధ భరించలేక రైతు ఆత్మహత్యాయత్నం

KNR: హుజురాబాద్ మండలం కందుగుల గ్రామానికి చెందిన ఇమ్మడి సదానందం అనే రైతు అప్పుల బాధ భరించలేక పురుగుల మందు తాగి సోమవారం ఆత్మహత్య యత్నం చేశాడు. వెంటనే గమనించిన స్థానికులు 108 వాహనంలో హుజురాబాద్ ఏరియా ఆసుపత్రికి తరలించి ప్రథమ చికిత్స అందించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం వరంగల్ ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు.