జిల్లాలో కోడిపందెం.. నలుగురిపై కేసు నమోదు

జిల్లాలో కోడిపందెం.. నలుగురిపై కేసు నమోదు

NLR: నెల్లూరు రూరల్ దంతాలిలో కొందరు గుట్టు చప్పుడు కాకుండా కోడిపందేలు నిర్వహిస్తున్నారు. సీఐ వేణుకు సమాచారం రావడంతో తన సిబ్బందిని కోడిపందెం స్థావరం వద్దకు పంపించారు. ఈ ఘటనలో నలుగురిని అదుపులో తీసుకున్నారు. వారి నుంచి రెండు కోళ్లు, రూ. 7వేలు స్వాధీనం చేసుకున్నారు. దీనిపై శుక్రవారం రూరల్ పోలీసులు కేసు నమోదు చేశారు.