సీసీ రోడ్డు పనులను ప్రారంభించిన కార్పొరేటర్
HYD: ఐఎస్ సదన్ డివిజన్‌లోని సెంట్రల్ ఎక్సెస్ కాలనీలో 23.38 లక్షల వ్యయంతో సీసీ రోడ్డు నిర్మాణ పనులకు డివిజన్ కార్పొరేటర్ జంగం శ్వేత మధుకర్ రెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ.. పనులను నాణ్యతతో ప్రణాళికాబద్ధంగా పూర్తి చేయాలని కాంట్రాక్టర్లకు సూచించారు. బీజేపీ సీనియర్ నాయకుడు జంగం మధుకర్ రెడ్డి, కాలనీ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.