కాలం కంటే ముందు నిలబడేవారే కవులు: కొండి మల్లారెడ్డి
SDPT: కవి మహమూద్ రచించిన "కలవార" కవిత్వ సంపుటిని సిద్దిపేట ప్రెస్ క్లబ్‌లో ఆవిష్కరించారు. కాల ప్రవాహంలో పడి కొట్టుకుపోయే వారికంటే, కాలం కన్నా ఒకక్షణం ముందు నిలబడి రాబోయే ఉపద్రవాన్ని పసిగట్టి సమూహాన్ని అప్రమత్తం చేసేవారే కవులు రచయితలుగా నిలదొక్కుకోగలుగుతారని తెలంగాణ రచయితల వేదిక రాష్ట్ర అధ్యక్షుడు కొండి మల్లారెడ్డి అన్నారు.