రేపు నూజివీడులో మీకోసం కార్యక్రమం

రేపు నూజివీడులో మీకోసం కార్యక్రమం

ELR: నూజివీడు పట్టణంలోని సబ్‌కలెక్టర్ కార్యాలయంలో రేపు ఉదయం 10 గంటలకు మీకోసం ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహించనున్నట్లు సబ్‌కలెక్టర్ బొల్లిపల్లి వినూత్న తెలిపారు. ఆమె ఆదివారం మాట్లాడుతూ.. రెవిన్యూ డివిజన్ పరిధిలోని ప్రజలు తమ సమస్యలను అర్జీల రూపంలో అందించవచ్చన్నారు. సమస్యలను నిర్ణీత వ్యవధిలో పరిష్కరిస్తామని పేర్కొన్నారు.