వ్యవసాయ భూములకు నీరందించాలి : సీపీఎం

వ్యవసాయ భూములకు నీరందించాలి : సీపీఎం

అనంతపురం: జిల్లాలో హంద్రీనీవా కాలువ వెడల్పు చేసి వ్యవసాయ భూములకు నీరు అందించాలని సీపీఎం పార్టీ నాయకులు డిమాండ్ చేశారు. జిల్ల నాయకులు నరసింహులు మాట్లాడుతూ.. 35 సంవత్సరాల క్రితం కరువు సీమకు వరప్రసాదనిగా ప్రకటించిన హంద్రీనీవా వ్యవసాయానికి వరంగా మారలేదన్నారు. కాలువను వెడల్పు చేసి పిల్లకాలువలు ఏర్పాటు చేసి తద్వారా వ్యవసాయ భూములకు నీరు ఇవ్వాలని కోరారు.