మూడు రోజులు విద్యుత్ సరఫరాకు అంతరాయం
AKP: పరవాడ మండలంలో పలు గ్రామాలకు గురువారం నుంచి ఈనెల 20వ తేదీ వరకు విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడుతుందని ఈఈ రామకృష్ణ ఓ ప్రకటనలో తెలిపారు. సబ్ స్టేషన్ నిర్వహణ పనుల్లో భాగంగా మూడు రోజులపాటు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు పరవాడ, పోలిరెడ్డి పాలెం, వెంకటాపురం, పెదముషిడివాడ పరిధిలో విద్యుత్తు సరఫరాకు అంతరాయం ఏర్పడుతుందన్నారు.