లారీ ఢీకొని రిటైర్డ్ ఆర్టీసీ ఉద్యోగి మృతి
KNR: శంకరపట్నం మండలం మొలంగూర్ అండర్ పాస్ వద్ద గురవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఇందులో కొత్తగట్టుకు చెందిన రిటైర్డ్ ఆర్టీసీ ఉద్యోగి మీస రవీందర్(65) మృతి చెందగా, ఆలయ ఛైర్మన్ రాజిరెడ్డికి తీవ్ర గాయాలయ్యాయి. MLA కవ్వంపల్లి సత్యనారాయణను కలిసి బైక్‌పై తిరిగి వస్తుండగా వేగంగా వచ్చిన లారీ వీరిని ఢీకొట్టింది. ప్రమాద తీవ్రతకు రవీందర్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.