పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే
GNTR: గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గళ్లా మాధవి 35వ డివిజన్ పట్టాభిపురంలో రహదారి, సైడ్ కాల్వల నిర్మాణానికి సోమవారం శంకుస్థాపన చేశారు. రూ.3.40 లక్షల వ్యయంతో అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టామని, పశ్చిమ నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లడమే తన లక్ష్యమని చెప్పారు. ఈ కార్యక్రమంలో మేయర్ కోవెలమూడి రవీంద్ర, కమిషనర్ పులి శ్రీనివాసులు పాల్గొన్నారు.