గ్యాస్ వినియోగదారులకు BIG SHOCK
LPG సిలిండర్ల బుకింగ్ వ్యవధిని పెంచుతూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. రెండు బుకింగ్‌ల మధ్య వ్యవధిని 21 రోజుల నుంచి 25 రోజులకు పెంచింది. వంట గ్యాస్ సిలిండర్ల బ్లాక్ మార్కెట్‌ను కట్టడి చేసేందుకు ఈ నిర్ణయం తీసుకుంది. మరోవైపు LPG ఉత్పత్తిని పెంచాలని రిఫైనరీలను కేంద్రం ఆదేశించింది. సరఫరాలో గృహావసర సిలిండర్లకే ప్రాధాన్యం ఇవ్వాలని తెలిపింది.