వాడపల్లి వెంకన్న ఆలయానికి పోటెత్తిన భక్తులు

వాడపల్లి వెంకన్న ఆలయానికి పోటెత్తిన భక్తులు

కోనసీమ: ఆత్రేయపురం మండలంలోని వాడపల్లి గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో శనివారం వేకువజామున నుండి అధిక సంఖ్యలో భక్తులు పోటెత్తారు. ఈ సందర్భంగా స్వామివారి ఆలయ సన్నిధిలో ఆలయ అర్చకులు స్వామివారికి మేలుకొలుపు, సుప్రభాత సేవలు, ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులు స్వామిని దర్శించి మొక్కులు చెల్లించుకున్నారు.