యుద్దం ఎఫెక్ట్.. వేగేశ్వరపురంలో గ్యాస్ కష్టాలు

యుద్దం ఎఫెక్ట్.. వేగేశ్వరపురంలో గ్యాస్ కష్టాలు

E.G: పశ్చిమాసియా యుద్ధ ప్రభావంతో గ్యాస్ కొరత వల్ల తాళ్లపూడి మండలం వేగేశ్వరపురంలో సిలిండర్ల కోసం జనం ఎగబడ్డారు. ఓటీపీ ఉంటేనే గ్యాస్ ఇస్తామని చెప్పడంతో వినియోగదారులు ఇబ్బంది పడ్డారు. మూడు ఏజెన్సీలకు గాను ఒక్కటే సరఫరా చేస్తుండటం, అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో వృద్ధులు, వికలాంగులు మండుటెండలో గంటల తరబడి వేచి చూడాల్సి వచ్చింది. అరకొర సరఫరాపై స్థానికులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.