ప్యారడైజ్ టీ పాయింట్‌లో ఎలుకల కలకలం

ప్యారడైజ్ టీ పాయింట్‌లో ఎలుకల కలకలం

హైదరాబాద్ నగరంలోని ఐమాక్స్ సమీపంలోని ప్యారడైజ్ టీ పాయింట్, బేకరీ ఐటమ్స్‌లో ఎలుకలు స్వైరవిహారం చేస్తున్నాయి. టీ పాయింట్‌లో ఎలుకలు తిరుగుతున్నప్పటికీ ప్యారడైజ్ సిబ్బంది పట్టించుకోవడం లేదని కస్టమర్లు వాపోతున్నారు. ఎలుకలు తిరిగితే ఏమవుతుందంటూ నిర్లక్ష్యంగా సమాధానం ఇస్తున్నట్లు కస్టమర్లు తెలిపారు. ఈ ఘటనపై ఫుడ్ సేఫ్టీ అధికారులు స్పందించాలని కోరుతున్నారు.