నీటి సమస్యపై కలెక్టర్‌కు గ్రామస్తుల విన్నపం

SRD: వారం రోజుల నుంచి మిషన్ భగీరథ నీళ్లు రావడం లేదని కంగ్టి మండలం బోర్గి గ్రామస్తులు కలెక్టర్‌కు మొర పెట్టుకున్నారు. సంబంధిత అధికారులకు తెలిపిన స్పందన లేదని, సమీప వాగు నుంచి నీళ్లు తెచ్చుకొని తాగుతున్నాం అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామంలోని 3 వేల మంది వాటర్ సప్లై నీటిపైనే ఆధారపడి ఉన్నారన్నారు. వాగు నీళ్లు తాగడంతో రోగాలు వస్తున్నాయన్నారు. నీరు సప్లై చేయకపోతే ఆందోళన చేస్తామన్నారు.