జడ్పీ హైస్కూల్లో రాజ్యాంగ దినోత్సవం వేడుకలు

జడ్పీ హైస్కూల్లో రాజ్యాంగ దినోత్సవం వేడుకలు

NLR: సంగం పట్టణంలోని జిల్లా ప్రజా పరిషత్ హై స్కూల్‌లో బుధవారం రాజ్యాంగ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. భారీ జాతీయ జెండాతో ఉపాధ్యాయులు, విద్యార్థులు ర్యాలీ చేపట్టారు. స్వాతంత్య్ర సమరయోధుల వేషధారణలో విద్యార్థులు ఆకట్టుకున్నారు. ఈ కార్యక్రమంలో ఎంఈవో మల్లయ్య, హెచ్ఎం బుజ్జయ్య, విద్యార్థులు పాల్గొన్నారు.