కాంగ్రెస్ 'డైవర్షన్ పాలిటిక్స్' చేస్తుంది: మాజీమంత్రి

కాంగ్రెస్ 'డైవర్షన్ పాలిటిక్స్' చేస్తుంది: మాజీమంత్రి

TG: ఫార్ములా-ఈ రేస్ విచారణకు గవర్నర్ అనుమతినివ్వడం కాంగ్రెస్, BJP కలిసి BRSపై చేస్తున్న కుట్ర అని మాజీమంత్రి ప్రశాంత్ రెడ్డి ఆరోపించారు. BRSను ఎదుర్కోలేక రేవంత్ రెడ్డి BJPతో కలిసి 'డైవర్షన్ పాలిటిక్స్' చేస్తున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ వైఫల్యాల నుంచి దృష్టి మరల్చేందుకే ఇలాంటి కక్షపూరిత రాజకీయాలకు తెరలేపారని అన్నారు. ఈ కుట్రలను న్యాయస్థానాల్లో ఎదుర్కొంటామని తెలిపారు.