డ్రంక్ అండ్ డ్రైవ్.. ఆరుగురికి జైలు శిక్ష
KKD: మద్యం తాగి వాహనాలు నడిపిన 12 మందిని గురువారం కాకినాడ కోర్టులో హాజరుపరచగా, ఆరుగురికి రూ. 10 వేల చొప్పున జరిమానా, మరో ఆరుగురికి జైలు శిక్ష విధించినట్లు ఎస్సై సత్యనారాయణ రెడ్డి తెలిపారు. తాళ్లరేవు మండల వ్యాప్తంగా డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్షలు నిర్వహిస్తున్నామని, మద్యం సేవించి వాహనాలు నడిపితే జైలుకు పంపిస్తామని ఆయన హెచ్చరించారు.