కృష్ణమూర్తి సేవలు ప్రశంసనీయం: ఎమ్మెల్యే
VZM: మానవతా సేవలో సమాజానికి ఆదర్శంగా నిలుస్తున్న పోలీస్ సిబ్బందిని పార్వతీపురం ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర శాలువాతో సత్కరించారు. ప్రతి నెల తమ వేతనంలో కొంత భాగాన్ని పేదల కోసం ఖర్చు చూస్తున్న హెడ్ కానిస్టేబుల్ కొరిమి కృష్ణమూర్తిని అభినందించారు. పేదల పట్ల మానవతా దృక్పథంలో సేవలు చేయడం గొప్ప విషయమన్నారు. ఇలాంటి వారిని సన్మానించడం ఆనందంగా ఉందని ఎమ్మెల్యే పేర్కొన్నారు.