AITUC లో చేరిన కాంట్రాక్ట్ కార్మికులు
BDK: సింగరేణి కొత్తగూడెం కార్పొరేట్ పరిధిలోని మెయిన్ వర్క్ షాప్ లో పనిచేస్తున్న మెకానికల్ సెక్షన్ కాంట్రాక్ట్ కార్మికులు బుధవారం ఏఐటీయూసీ అనుబంధ సింగరేణి కాంటాక్ట్ వర్కర్స్ యూనియన్‌లో చేరారు. యూనియన్ నాయకులు మాట్లాడుతూ.. నిరంతరం కాంట్రాక్ట్ కార్మికుల హక్కుల కోసం, సమస్యల సాధన కోసం పోరాడుతున్న ఏఐటీయూసీ లో కాంట్రాక్ట్ కార్మికులు చేరడం మంచిదని అన్నారు.