VIDEO: ప్రశాంత వాతావరణంలో పోలింగ్: జిల్లా ఎస్పీ
BDK: చుంచుపల్లి మండలం రుద్రంపూర్ గ్రామపంచాయతీ పోలింగ్ బూత్‌ను ఇవాళ జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్ సందర్శించారు. వారు మాట్లాడుతూ, ఓటర్లు ఆసక్తిగా పోలింగ్ బూత్‌కు వచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారని తెలిపారు. ఎటువంటి ఆవాంఛనీయ సంఘటనలు జరగకుండా పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. సాయంత్రం ఫలితాలు తర్వాత డీజే ర్యాలీల కు పర్మిషన్ లేదన్నారు.