యుటిఎఫ్ కార్యవర్గ సభ్యులను అభినందించిన ఎంఈవో
SKLM: నరసన్నపేట యుటీఎఫ్ మండల కార్యవర్గ సభ్యుల ఎన్నిక మంగళవారం ఏకగ్రీవంగా జరిగింది. ఎన్నికైన కార్యవర్గ సభ్యులకు ఎంఈవో పేడాడ దాలినాయుడు అభినందనలు తెలియజేశారు. ఇవాళ ఉదయం నరసన్నపేట ఎంఆర్సీ కార్యాలయంలో కలిసిన అధ్యక్ష, కార్యదర్శులు నక్క అప్పయ్య, జగదీష్‌తో పాటు సభ్యులు ఆయనను కలుసుకున్నారు. ఎంఈఓ మాట్లాడుతూ.. ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి కృషి చేయాలన్నారు.