VIDEO: 'పెరిగిన తుప్పలు తొలగించాలి'
ASR: డుంబ్రిగుడ మండలం పోతంగి పంచాయితీ లివిటిపుట్టు నుంచి వంతర్డ జంక్షన్ వరకు రోడ్డుకు ఇరువైపులా తుప్పలు ఏపుగా పెరగడంతో ప్రయాణం ప్రమాదకరంగా మారింది. ఈ తుప్పలు వలన మలుపుల వద్ద ఎదురుగా వస్తున్న వాహనం కనిపించక చోదకులు ఇబ్బందులకు గురవుతున్నారు. మలుపుల వద్ద తుప్పలతో ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని తెలిపారు. కావున అధికారులు స్పందించి తుప్పలు తొలగించాలని ప్రజలు కోరుతున్నారు.