భయపెట్టిన అడవి పందులు
ASF: తిర్యాణి గ్రామంలోకి చొరబడిన అడవి పందుల గుంపు ప్రజలను భయాందోళనకు గురిచేసింది. సుమారు 15-20 పందులు ఇళ్లల్లోకి చొరబడి, ద్విచక్ర వాహనంతో వెళ్తున్న మంద మల్లేష్‌ను ఢీకొట్టాయి. యానిమల్ ట్రాకర్ బొజ్జురావుపై దాడి చేయడంతో స్వల్పంగా గాయపడ్డాడు. ఒక పంది మంచినీటి బావిలో పడిపోగా, గ్రామస్థులు, అటవీ సిబ్బంది కలిసి దాన్ని బయటకు తీసి వదిలిపెట్టారు.