మహిళా, శిశు సంక్షేమానికి ప్రణాళిక: కలెక్టర్
ATP: జిల్లాలో మహిళా, శిశు సంక్షేమ, వైద్య ఆరోగ్య శాఖలు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ ఓ.ఆనంద్ ఆదేశించారు. అంగన్వాడీ, పీహెచ్‌సీల పరిధిలో అవగాహన కార్యక్రమాలు విస్తృతంగా చేపట్టాలని అన్నారు. తక్కువ బరువున్న పిల్లల ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి సారించాలని, బాలింతలకు పౌష్టికాహారం సకాలంలో అందించాలని సూచించారు.