'అహుడ అభివృద్ధి వేగవంతం చేయాలి'
ATP: అహుడ అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని ఛైర్మన్ టీసీ వరుణ్, జాయింట్ కలెక్టర్ శివ నారాయణ శర్మ అధికారులను ఆదేశించారు. అక్రమ లేఅవుట్ల క్రమబద్ధీకరణలో పురోగతి సాధించాలని సూచించారు. ఎంఐజీ లేఅవుట్లు, ఎన్టీఆర్ స్మార్ట్ టౌన్‌షిప్‌లలో అత్యాధునిక మౌలిక సదుపాయాలు కల్పించి, ఫ్లాట్ కొనుగోలుదారులందరూ సంతృప్తి చెందేలా చూడాలని అన్నారు.