గల్లంతైన యువకుడి మృతదేహం లభ్యం

గల్లంతైన యువకుడి మృతదేహం లభ్యం

బాపట్ల: చీరాల సమీపంలోని గవనిపాలెం గ్రామానికి చెందిన మిండా బాలు (20) అనే యువకుడు దుర్గి మండలం అడిగొప్పల వద్ద సాగర్ కుడి కాలువలో ఆదివారం గల్లంతైన విషయం తెలిసిందే. పోలీసులు గాలింపు చర్యలు చేపట్టగా.. సోమవారం సాయంత్రం జూలకల్లు సమీపంలో యువకుడి మృతదేహం గుర్తించి బయటకు తీయించారు. కుటుంబ సభ్యులకు అప్పగించినట్లు ఎస్సై సుధీర్ కుమార్ తెలిపారు.