సుద్ధ ముక్కపై రవీంద్రనాథ్ ఠాగూర్ ప్రతిమ

SRPT: కోదాడ పట్టణానికి చెందిన ప్రముఖ కళాకారుడు నరేష్ చారి బుధవారం స్వాతంత్ర సమరయోధుడు రవీంద్రనాథ్ ఠాగూర్ జయంతి సందర్భంగా అంగుళం సుద్ధ ముక్కపై ఆయన ప్రతిమను చెక్కి ఘనమైన నివాళులు అర్పించారు. నరేష్ చారి గతంలో అనేక రకాలైన సూక్ష్మవస్తువులపై పలువు దేశ నాయకుల కళాఖండాలను ఆవిష్కరించి పలువురి మన్ననలు పొందాడు.