పోలీస్ కమీషనర్‌ను కలిసిన పరకాల నూతన ఏసీపీ

పోలీస్ కమీషనర్‌ను కలిసిన పరకాల నూతన ఏసీపీ

WGL: వరంగల్ పోలీస్ కమీషనరేట్ పరిధిలోని పరకాల నూతన ఏసీపీగా బాధ్యతలు చేపట్టిన సి. సతీశ్ బాబు వరంగల్ పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝాను కలిసి పూల మొక్కను అందజేశారు. ప్రజలు పోలీసులపై ఉన్న నమ్మకానికి తగ్గట్టుగానే నీతి నిజాయితీతో ప్రజలకు సేవలందించాలని పోలీస్ కమిషనర్ నూతన ఏసీపీకి సూచించారు.