ప్రత్యేక అలంకారంలో లక్ష్మీ సత్యనారాయణ స్వామి

ప్రత్యేక అలంకారంలో లక్ష్మీ సత్యనారాయణ స్వామి

కడప: నగరంలో గడ్డి బజార్లో వెలిసిన శ్రీ లక్ష్మీ సత్యనారాయణ స్వామి ఆలయంలో భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. పవిత్రమైన కార్తీక మాసం 2వ సోమవారం సందర్భంగా తెల్లవారుజామున నుంచి ఆలయ అర్చకులు విజయ్ బట్టర్ ఆధ్వర్యంలో స్వామివారికి విశేష అభిషేకం నిర్వహించారు. అనంతరం కనుల విందుగా లక్ష్మీ సత్యనారాయణ స్వామివారి మూల విరాట్, ఉత్సవ విగ్రహాలను అలంకరించి దర్శించుకున్నారు.