ఇరాన్ డ్రోన్ క్యారియర్ షిప్‌ను ధ్వంసం చేసిన అమెరికా
ఇరాన్‌పై అమెరికా దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా ఇరాన్ డ్రోన్ క్యారియర్ షిప్‌ను అగ్రరాజ్యం మిసైళ్లతో దాడి చేసి ధ్వంసం చేసింది. ఈ మేరకు క్యారియర్ ధ్వంసమైన వీడియోను అమెరికా సెంట్రల్ కమాండ్ విడుదల చేసింది. ఈ వీడియోలో చిన్న విమానవాహన నౌక సైజులో డ్రోన్ క్యారియర్ కనిపించింది. దాడి తర్వాత ఆ షిప్‌లో భారీగా మంటలు చెలరేగాయి. అయితే ఎంత మంది మరణించారనేది తెలియలేదు.