రేపు కామేపల్లి గుడిలో హుండీ లెక్కింపు
ప్రకాశం: జరుగుమల్లి మండలం కామేపల్లి గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ పోలేరమ్మ తల్లి ఆలయంలో రేపు బుధవారం హుండీ లెక్కింపు జరుగుతుందని ఈవో బైరాగి చౌదరి తెలిపారు. దేవస్థాన ఛైర్మన్ పోటు పెదబాబు, దేవాదాయ అధికారులు, గ్రామస్థుల సమక్షంలో ఈ లెక్కింపు జరుగుతుందన్నారు. భక్తులు ఈ లెక్కింపు కార్యక్రమంలో భక్తి శ్రద్ధలతో పాల్గొని అమ్మవారికి కృపకు పాత్రులు కావాలని ఆయన కోరారు.