ట్రేడింగ్ పేరుతో రూ.3 కోట్లు స్వాహా.. నిందితుడి అరెస్ట్
TG: సూర్యాపేటలో ఆన్‌లైన్ ట్రేడింగ్ పేరుతో మోసాలకు పాల్పడుతున్న నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం నిందితుడు లక్ష్మణ్ కుమార్‌ను రిమాండ్‌కు తరలించినట్లు అధికారులు తెలిపారు. సూర్యపేట, తిరుమలగిరి ప్రాంతాల్లో ట్రేడింగ్ పేరుతో ఉద్యోగాలు ఇప్పిస్తానని చెప్పి రూ.3 కోట్లు కాజేశాడు. బాధితుల ఫిర్యాదు మేరకు నిందితుడిని అరెస్ట్ చేశారు.