VIDEO: 'విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందజేయాలి'
ELR: జంగారెడ్డిగూడెం(మం) శ్రీనివాసపురం జడ్పీ హైస్కూల్ పాఠశాలను బుధవారం జనసేన నేత పోల్నాటి బాబ్జి ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా మధ్యాహ్న భోజన పథకాన్ని పరిశీలించి భోజన పదార్థాలను పరిశీలించారు. ప్రభుత్వం చిత్తశుద్ధితో విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకం అమలు చేస్తుందని అన్నారు. విద్యార్థులకు ప్రభుత్వ మెనూ ప్రకారం నాణ్యమైన ఆహారాన్ని అందజేయాలన్నారు.