'పటేల్ బతికుంటే దేశం అఖండ భారతావనిగా ఉండేది'
PPM: సర్దార్ వల్లభాయ్ పటేల్ బతికుంటే దేశం అఖండ భారతావనిగా వెలుగొందేదని ఎమ్మెల్యే బోనెల విజయ్ చంద్ర పేర్కొన్నారు. వల్లభాయ్ పటేల్ జయంతి సందర్భంగా పార్వతీపురం టీడీపీ కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. పటేల్ 1100 సంస్థానాలను భారత్‌లో విలీనం చేయించారని, లేకుంటే దేశం ఎన్నో ముక్కలుగా మారేదని పేర్కొన్నారు.